పిల్లలతో అక్షరాలు దిద్దించిన వైయస్

బడిబాట కార్యక్రమాన్ని 15 రోజుల పాటు కొనసాగించనున్నట్లు అహ్మదుల్లా చెప్పారు. ఐదేళ్లు దాటిన పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులను చైతన్యపరుస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఐదు లక్షల మంది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలను బడికి పంపించి విద్యావంతులను చేయడం వల్ల గ్రామీణ పేదరికం తొలుగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications