హైదరాబాద్: ప్రజాసమస్యలు బయటపెట్టి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నామని ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. నాలుగేళ్లుగా భూపోరాటాలు నిర్వహిస్తున్న తమపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నట్లు ఆయన శనివారం విమర్శించారు. ప్రజా ఉద్యమాలపై తుపాకులు ఎక్కుపెడుతూ, పాతకేసులు తిరగతోడుతూ తమను బెదిరించే యత్నాలు చేస్తున్నారన్నారు. జైలుశిక్షలు తమకు కొత్త కాదని, తాము భయపడేది లేదని అన్నారు.