రాజీపడను, రాజీ కోరను: నాయక్
హైదరాబాద్: తాను ఎవరినీ క్షమాపణ కోరలేదని, క్షమాపణ కోరే అవసరం కూడా లేదని మాజీ మంత్రి, టీఅర్ ఎస్ తిరుగుబాటు నాయకుడు రవీంద్రనాయక్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఅర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. అలాగే తాను కేసును ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తల్లోనూ వాస్తవం లేదన్నారు.
తెలంగాణ వాదం బలహీనపడలేదని, పోరాటం చేసేవారే బలహీనపడ్డారని రవీంద్రనాయక్ అన్నారు. నాయిని నర్సింహారెడ్డి అద్దెమైకులా మాట్లాడుతున్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాతా నాయిని రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పార్టీలని అసమ్మతివాదులపై వేటును ఎత్తివేయాలని రవీంద్రనాయక్ డిమాడ్ చేశారు.












Click it and Unblock the Notifications