ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం
ముంబయి: ముంబయి శివారులోని బాంద్రా రైల్వై స్టేషన్ లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. దాదాపు 200 శాంతీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో జరిగిందని అధికార వర్గాలు చెప్పాయి.
దాదాపు ఏడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 20 ఫైర్ ఇంజిన్లు, 16 వాటర్ ట్యాంకర్లు మంటలను అర్పడంలో నిమగ్నమయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరిని బాంద్రాలోని బాబా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications