హైదరాబాద్: టీఅర్ ఎస్ అధ్యక్షుడు కెసీఅర్ పై విమర్శలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నేడు మరోనేత అసమ్మతి గూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రె హ్మాన్ అసమ్మతి వర్గంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ పెద్ద మోసగాడని, 200 మంది గుండాలతో రాష్ట్ర కమిటీ వేశారని, వాళ్లే మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌పై తెలంగాణ భవన్‌లో దాడి చేశారని ఆరోపించారు. మహబూబ్ నగర్, బోధన్, మెదక్ లలో పార్టీకి సంబంధంలేని వారికి రెండు కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.