అస్ట్రేలియాలో టిడిపి నేతల హడావిడి
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో దాడులకు గురైన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిలు మెల్‌బోర్న్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి శ్రవణ్‌ను పరామర్శించారు. చికిత్సకోసం తెలుగుదేశం సేకరించిన 2.762 డాలర్ల ఆర్థికసాయాన్ని అతనికి అందజేశారు. అనంతరం అక్కడ భారత రాయబార కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో భారత కాన్సలేట్ పరిస్థితి ఘోరంగా ఉందని ఎవరైనా అక్కడ చనిపోతే స్థానిక భారతీయ లేక తెలుగుసంఘాలు విరాళం ఇస్తేనే మృతదేహాలు స్వదేశానికి వచ్చే పరిస్థితి ఉందని వారు తెలిపారు. వారు మెల్‌బోర్న్ పోలీసు కమిషనర్‌ను, ప్రతిపక్ష నేతలను కలుస్తారు.












Click it and Unblock the Notifications