హైదరాబాద్: ఎన్నికల సంఘాన్ని డీజీపీ యాదవ్ పదేపదే ప్రశ్నించడాన్ని బీజేపీ జాతీయనాయకుడు వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు, సలహాలను పాటించాలే కానీ వివాదం సృష్టించడం సబబు కాదని ఆయనన్నారు. దీని వెనక ఎవరున్నారో ప్రజలు తెలుసుకుంటారని వెంకయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్ల చీలిక వల్లే కాంగ్రెస్ గట్టెక్కగలిగిందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణా అంశంపై ముందు అధికార పక్షం తేల్చుకున్నాకే తాము మాట్లాడతామని వెంకయ్య చెప్పారు.