ఐదు రాష్ట్రాల్లో మావోల బంద్
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతకు నిరసనగా మావోయిస్టుల రెండు రోజుల బంద్ సోమవారం ప్రారంభమైంది. ఈ బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల్లోనూ పోలీసులను అప్రమత్తం చేశారు. బీహార్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రాల్లో నక్సలైట్లు బంద్ పాటిస్తున్నారు.
హింస చెలరేగే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆ ఐదు రాష్ట్రాలకు సూచించింది. నక్సలైట్లు భద్రతా బలగాలను, బస్సులను, రైళ్లను, రైల్వై స్టేషన్లను, బస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications