ఒరిస్సాలో ఇద్దరు మవోయిస్టుల హతం
భువనేశ్వర్: ఒరిస్సాలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కన్ గిరి జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఆదివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు నక్సలైట్లు అడవుల్లోకి పారిపోయారని, ఈ సమయంలో పోలీసులు వెంబడించారని, ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సంజీబ్ కుమార్ పాండా సోమవారంనాడు చెప్పారు. 9ఎంఎం పిస్టళ్లను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications