10 లక్షల ఎకరాలకు నీరు: సీఎం
హైదరాబాద్: వచ్చే అయిదేళ్లలో 9,600 కోట్ల రూపాయలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
250 కోట్లతో పంచాయతీ చెరువుల అభివృద్ధి చేపట్టాలని, కృషి విజ్ఞానకేంద్రాల ద్వారా లక్షా 65 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇరిగేషన్ పథకాలకు నిధులకోసం ఇబ్బందిపడవద్దని, వాటికోసం ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గవద్దని కోరారు.












Click it and Unblock the Notifications