ఏబీవీపీ బంద్: స్కూళ్లు మూత
హైదరాబాద్: పాఠశాలల్లో విపరీతంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నగరంలో బంద్ జరిగింది. ఉదయం స్కూళ్లు ప్రారంభం కాగానే ఏబీవీపీ కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపాళ్లను కలిసి స్కూలు మూసివేయాలని కోరారు.
తమ డిమాండ్లను తెలిపారు. అందుకు అంగీకరించని చోట యాజమాన్యాలతో ఘర్షణలకు దిగారు. దీంతో చాలావరకు స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాఠశాలలను మూసివేశారు. కొన్ని చోట్ల పోలీసులు ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications