నాసిక్: బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పై, సుజ్లోన్ కంపెనీ చైర్మన్ తులసీబాయ్ తంతిపై, పలువురు ఇతరులపై పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బార్ లో విండ్ మిల్లు స్థాపనకు అక్రమంగా భూమి కొనుగోలు చేసినట్లు వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
పోలీసులకు ఆనంద్ లాలా థాకరే అనే వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని అక్రమంగా కొనుగోలు చేసి సుజ్లోన్ కంపెనీకి బదలాయించారని ఆయన ఆరోపించారు. ఆ కంపెనీలో ఐశ్వర్యా రాయ్ వాటాదారు.