బస్సు లోయలో పడి 12 మంది మృతి
జమ్ము: జమ్మూ కాశ్రీర్ రాష్ట్రంలో బస్సు లోయలో పడడంతో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జమ్మూ-కాత్రా రహదారిపై పంథాల్ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్రమాదం సంభవించిన స్థలం జమ్ముకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
బస్సు కాత్రాకు వస్తుండగా ఉదయం 7 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు కాత్రా డిఎస్పీ జుగల్ కిశోర్ చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications