భారత్ విజ్ఞప్తి అందలేదు: పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల కేసులో నిందితులను అప్పగించాలని భారత్ నుంచి తమకు ఎటువంటి విజ్ఞప్తి అందలేదని పాకిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. ముంబై దాడులతో ప్రమేయం ఉన్న 22 పాకిస్తానీలపై మంగళవారం భారత కోర్టు అరెస్టు వారంట్లు జారీ చేసింది. ముంబై దాడుల కేసులో అనుమానితులను తమకు అప్పగించాలని భారత ప్రాసిక్యూటర్లు పాకిస్తాన్ ను డిమాండ్ చేశారు.
భారత్, పాక్ ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందమేదీ లేదని, ముంబై దాడుల కేసులో అనుమానితులను అప్పగించాలని భారత్ నుంచి తమకు ఏ విధమైన లేఖ అందలేదని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అన్నారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్, జకీ - ఉర్ - రహ్మాన్ లక్వీ, జరార్ షాలను తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. నేరం జరిగిన చోట వీరెవరూ లేరని బాసిత్ ఒక న్యూ ఏజెన్సీతో అన్నారు.
దాడుల జరిగిన మొదటి రోజు నుంచే తాము సహకరిస్తున్నామని, తాము కొంత మందిని అరెస్టు చేశామని, వారు కటకటాల వెనకే ఉన్నారని, వాయిదాల పద్ధతిలో కాకుండా తమకు సంబంధిత పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!











Click it and Unblock the Notifications