రాజకీయ వేదిక చేశారు: నాగం
హైదరాబాద్: జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వేదికగా మార్చారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాజకీయ ప్రసంగం చేయడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రజలు తమను గెలిపించారని చెప్పడమే కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారని ఆయన చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని 36 శాతం మంది ప్రజలు మాత్రమే ఆమోదించారని, 64 శాతం మంది ప్రజలు తిరస్కరించారని ఆయన చెప్పారు. ఎరువులు, విత్తనాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బోగస్ కార్డుల ఏరివేత పేరుతో అర్హులైనవారి కార్డులు తొలగిస్తే సహించబోమని ఆయన చెప్పారుట. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications