ముంబై: ముంబైలోని తాజ్ హోటల్లో శనివారంనాడు అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ఫైర్ టెండర్లు, వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ప్రాణ నష్టమేదీ సంభవించలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియదని డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు చెప్పారు.
అగ్ని ప్రమాదానికి హోటల్ లోని పలు భాగాలు కాలిపోయాయి. నిరుడు నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఇంత నష్టం వాటిల్లడం ఇదే ప్రథమం.