తెలంగాణపై ఇప్పటికింతే: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలంగాణపై ప్రస్తుత వైఖరే కొనసాగుతుందని, దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్ఫష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందా? లేదా? అన్న అభద్రతాభావం వద్దని, ఇప్పుడు ఓడినవారే ఆయా నియోజకవర్గాలకు ఇన్‌ ఛార్జులుగా ఉంటారని ఆయన ప్రకటించారు. పార్టీ వర్క్‌షాప్‌ లో భాగంగా చంద్రబాబు శుక్రవారం జిల్లాల నేతలతో సమీక్ష జరిపారు. ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులే 2014 ఎన్నికల్లో మళ్లీ అభ్యర్థులవుతారని అన్నారు. అయితే ఆయా నేతలు ఇన్‌ ఛార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఎన్నికలు జరిగినా గెలుపోటములకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లా కన్వీనర్ల జోక్యం ఉండబోదన్నారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై దేశవ్యాప్త చర్చ లేవనెత్తాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈవీఎంలను ఎలా తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకునేందుకు వీలుందో వివరిస్తూ ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక నోట్‌ను తయారు చేస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీ, వివిధ రాష్ట్రాల రాజధానులలో మీడియా ముందు చర్చ పెట్టాలని అనుకుంటున్నారు. అనంతరం రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజల మధ్య చర్చకు తెరతీయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+