ఎంపీ మందా జగన్నాథంపై కేసు
మహబూబ్ నగర్: దురుసుగా ప్రవర్తించి తనపై చేయిచేసుకున్న పార్లమెంటు సభ్యుడు మందాజగన్నాథంపై ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాను నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, సరిగ్గా పనిచేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతికంగా దాడి చేయడమేంటని ఆయన అన్నారు.
మరోవైపు మందా జగన్నాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీల రుణాల మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మందా జగన్నాథం సోమవారం బ్యాంకు మేనేజర్‌పై మండిపడ్డారు. సరిగ్గా పనిచేయడంలేదంటూ ఆయనపై చేయిచేసుకున్నారు.












Click it and Unblock the Notifications