భారత్ లో తొలి స్వైన్ ఫ్లూ మృతి
తిరువనంతపురం: భారతదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదైంది. కేరళలోని కొల్లంలో 51 ఏళ్ల ఎన్నారై బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఆ వ్యక్తిని స్టాన్లీ పెలిస్ గా గుర్తించినట్లు, జూన్ మొదటి వారంలో ఇంగ్లాండు నుంచి వచ్చాడని, హోలీ క్రాస్ ఆస్పత్రిలో చేరిన కొద్ద గంటలకే మరణించాడని రాష్ట్ర ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ కె.శైలజ చెప్పారు.
స్టాన్లీ రక్తం నమూనాలను జాతీయ అంటువ్యాధుల జాతీయ సంస్థకు పంపారు. జలుబు, ఇతర స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధ పడుతున్న ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించాడని అంటున్నారు. స్టాన్లీ ఇంగ్లాండు నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చాడని, ఆ తర్వాత దేశీ విమానంలో తిరువనంతపురం వచ్చాడని శైలజ చెప్పారు.












Click it and Unblock the Notifications