మేడసానికి తానా అవార్డు
చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రారంభ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి చికాగోలోని రోస్‌మాంట్ కన్వెన్షన్ సెంటరులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ అవధాని మేడసాని మోహన్, ప్రముఖ నవలా రచయత సూర్యదేవర రామ్మోహనరావు తదితరులు అవార్డులు అందుకున్నారు. ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ క్విన్ చేతుల మీదుగా ఈ అవార్డులను తీసుకున్నారు. వీరితో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించిన తానా ట్రస్టు బోర్డు ఛైర్మన్ జానకీరావు, చిలుకూరి సతీష్, ల్యాంకో పవర్ మేనేజింగ్ డైరక్టర్ లగడపాటి మధుసూదనరావు, సీ.ఆర్ స్వామినాధన్,డాక్టర్ టి.కిరణ్ కుమార్, రామ ముత్యాల, పరిడి రాజేశ్వరి, పి.వి.ప్రసాద్, డాక్టర్ ఉప్పులూరి సుబ్బారావు, వంశీ రామరాజు, డాక్టర్ అట్లూరి శ్రీమన్నారాయణ, డాక్టర్ మన్నవ శివకుమార్, డాక్టర్ గోగినేని శివరాం, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జమ్మి శ్రీనివాసరావు, పాతూరి ప్రభాకరరావు, డాక్టర్ వై.భాస్కరరావు, డాక్టర్ ఎం.రామిరెడ్డి, డాక్టర్ నన్నపనేని మంగాదేవీ, ఎ.ప్రేంచంద్, డాక్టర్ అక్కినేని సుదర్శనరావులకు ఇల్లినాయుస్ గవర్నర్ చేతుల మీదుగా తానా అవార్డులను అందజేశారు. సినీనటుడు మురళీమోహన్‌కు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేశారు.












Click it and Unblock the Notifications