'ఎమ్మెల్యే రేప్ యత్నం చేశాడు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు వ్యవహారం మరో మలుపు తిరిగింది. టీవీ రామారావు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని కొవ్వూరు నర్సింగ్ కళాశాలకు చెందిన కేరళ విద్యార్థిని శనివారం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థినితో పాటు మరింత మంది నర్సింగ్ విద్యార్థినులు కూడా హోంమంత్రిని కలుసుకున్నారు. రామారావు నర్సింగ్ కళాశాలలో ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేశాడని ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణ రావడానికి మూడు రోజుల ముందు కూడా ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారని నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.
గత నెల 14వ తేదీన తనపై అత్యాచార యత్నానికి శాసనసభ్యుడు పాల్పడ్డారని, దాన్ని ప్రశ్నించడానికి తమ తల్లిదండ్రులు వస్తే రామారావు కుమారుడు శేఖర్ వారిని బెదిరించాడని ఆ విద్యార్థిని చెబుతోంది. తమపై అత్యాచార యత్నం, హత్యాయత్నం జరిగిందని ఇద్దరు విద్యార్థినులు చెప్పారు. తమను ఈ నెల 20వ తేదీన శేఖర్ తమను కారులో నెల్లూరులో దింపి కేరళ వెళ్లిపోవాలని చెప్పాడని, తాము కేరళ వెళ్లిపోయామని, తాము పిలిచే వరకు తిరిగి రావద్దని చెప్పాడని వారన్నారు. తమ సెల్ ఫోన్లు, సిమ్ లు కూడా లాక్కున్నారని, అవి వారి వద్దనే ఉన్నాయని వారు చెప్పారు.
ఆ విద్యార్థినులు చదువుతున్న టీవిఆర్ నర్సింగ్ కళాశాల శాసనసభ్యుడికి సంబంధించిందే. విద్యార్థినులు తమ వాంగ్మూలాలను సిఐడికి చెప్పాలని సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. రామారావుపై సిఐడి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications