అబ్దుల్లా బుఖారీ కన్నుమూత
న్యూఢిల్లీ: చారిత్రాత్మక జామా మసీదు మాజీ షాహీ ఇమామ్ మౌలానా సయ్యద్ అబ్దుల్లా బుఖారీ బుధవారం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 87 ఏళ్లు.
ప్రముఖ మత గురువు బుఖారీ బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మరణించినట్లు ప్రస్తుత షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో తెలిపింది. అబ్దుల్లా బుఖారీ జామా మసీద్ 12వ షాహీ ఇమామ్ గా పని చేశారు. బుఖారీ రాజస్థాన్ లోని సాంభార్ లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications