ఒంగోలు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినందుకు నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. కరణం బలరాం, నన్నపనేని రాజకుమారి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వీరికి పోటీగా యువజనకాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి జీపులో బలవంతంగా ఎక్కించి తరలిస్తుండగా నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. టిడిపి కార్యకర్తలను రక్షించుకునే ప్రయత్నంలో కరణం బలరాం పోలీసుల మీద తిరగబడ్డారు.