ఒంగోలు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు కూల్చివేశారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.