హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నగర నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ పక్రియ వెలువడడంతో బాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. చక్కని ప్రణాళికతో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడంతో ఆయన ఎత్తుకు పై ఎత్తు వేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంది.