వెల్లింగ్ టన్: న్యూజిలాండ్ దక్షిణప్రాంతంలో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప తీవ్రతను పురస్కరించుకొని పసిఫిక్ సముద్రతీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో న్యూజిలాండ్ కు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని హవాయ్ లోని పసిఫిక్ సునామీ సెంటర్ హెచ్చరించింది. నైరుతి న్యూజిలాండ్ కు 161 కిలోమీటర్ల దూరంలోని ఇన్వర్ కార్గిల్ దక్షిణ ప్రాంతంలో 33 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియాలజికల్ సర్వే ప్రకటించింది. సునామీ హెచ్చరికలతో సమీప తీర ప్రాంతాలు వారు అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ ఎటువంటి ప్రాణనష్టంగాని, ఆస్తినష్టం గాని జరిగలేదు.