గెలిచితీరాలంతే..వైయస్ హెచ్చరిక

ఈ నెల 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రకటన వెలువడుతుందని ఆగస్టు 18న పోలింగ్ ఉంటుందని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లున్నాయని, కాంగ్రెస్ సెంచరీ సాధించి తీరాలని గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై అధికారపార్టీ ఇప్పటికే కసరత్తు చేసింది. మూడు రోజుల్లో మరోసారి విస్తృతంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 150 డివిజన్లలో మజ్లిస్ ప్రభావం గణనీయంగా ఉండే పాతబస్తీలోని 25 డివిజన్లపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications