హైదరాబాద్: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లోని చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం ముందు ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగటంతో పోలీసులు చిరంజీవి, ఇతర నేతలను అరెస్టుచేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు నేతలు గాయపడటంతో వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.