హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ కు జరగనున్న ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్థతిని అమలుచేయాలని వారు కోరారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని ఇటీవల పలు సంస్థలవారు ప్రయోగాత్మకంగా రుజువుచేశారని అందుకే అక్రమాలకు తావులేని బ్యాలట్ పద్థతిని ప్రవేశపెట్టాలని వారు కోరారు.