హైదరాబాద్: ఆకాశాన్ని అంటిన కందిపప్పు ధరను మూడు నెలల్లో నియంత్రిస్తామని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డి హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో వైయస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు కనీస మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేద పిల్లల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముంద రాజీవ్ గృహకల్ప లభ్దిదారులకు ఇళ్లు మంజూరైన పత్రాలను వైయస్ పంపిణీ చేశారు.