తిరుపతి వెళ్ళకుండానే క్షవరం: బాబు

గడచిన ఐదేళ్లలో కాంగ్రెస్ హైదరాబాద్‌కు ఏం చేసిందని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు వారికి ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. "హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, బయోటెక్ పార్క్, బిజినెస్ స్కూల్ వంటివన్నీ తెచ్చింది టీడీపీ. సైబరాబాద్ పేరుతో శివార్లలో ఒక కొత్త నగరం రూపుదిద్దుకొంది మన హయాంలోనే. మనం చేసిన వాటిని చెడగొట్టడం తప్ప కాంగ్రెస్ ఏం చేసింది? ఆ పార్టీకి ప్రజలు తగిన శాస్తి చేయాలి" అన్నారు.
ఇక కాంగ్రెస్‌ను ఓడించే శక్తి, సత్తా టీడీపీకి మాత్రమే ఉన్నాయని, మిగిలిన పార్టీలకు ఓటు వేస్తే అది కాంగ్రెస్‌కు లాభం చేసినట్లేనని ఆయన చెప్పారు. కాగా..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవీఎస్ రెడ్డికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications