తిరుమల: వారాంతపు సెలవులు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది. మొత్తం 28 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. దీంతో టిటిడీ సెల్లార్ దర్శనాలను రద్దు చేసింది. మహాలఘు దర్శనాలను కొనసాగిస్తున్నారు.