Monsoon Cloud: వర్షాన్ని మోసుకొస్తున్న భారీ మేఘం-ఏకంగా 10 వేల కిలోమీటర్ల పొడవు..!

వేసవి ముగిసిపోయి వర్షాకాలం వచ్చేసినా ఇంకా వర్షాలు లేక అల్లాడుతున్న భారత్ కు మరో గుడ్ న్యూస్ అందింది. భారత్ కు సకాలంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు వచ్చినా ఎల్ నినో ప్రభావంతో వాటి పురోగతి లేక దేశవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రుతుపవనాలకు ఊతమిచ్చేలా భారత్ నుంచి కొరియా వరకూ ఏకంగా 10 వేల కిలోమీటర్ల పాటు ఓ భారీ రుతుపవన మేఘం (Monsoon Cloud) విస్తరించినట్లు కనిపిస్తున్న ఉపగ్రహ చిత్రంతో ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.

ఇందులో ఉత్తర భారతం నుంచి హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు విస్తరించి 7 వేల నుంచి 10 వేల కిలోమీటర్ల పొడవైన అద్భుతమైన వర్షపు మేఘం కనిపిస్తోంది. దీన్ని ఉపగ్రహ చిత్రాల్లో బంధించారు. రుతుపవనాల్ని మోసుకొస్తున్నట్లు కనిపిస్తున్న ఈ భారీ మేఘాల వరుస ఇప్పుడు భారత్ కు ఆశాదీపంలా కనిపిస్తోంది. ఇందుకంటే ఈ 10 వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన భారీ మేఘాల వల్ల అంతే భారీ స్దాయిలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Giant 10 000-km Monsoon Cloud Covers India Himalayas China and South Korea

వర్షపాత అంచనాల ప్రకారం గత రెండు రోజుల్లో భారత్ లో సాధారణ రోజువారీ రుతుపవన వర్షపాతంలో సుమారు 170-180 శాతం నమోదు చేసినట్లు అంచనా వేశారు. దీంతో ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం నమోదైన సమయంగా ఇది నిలిచింది. వాతావరణ శాస్త్రవేత్తలు అయితే ఈ సంఘటనను భారీ రుతుపవన దినంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాలలో వర్షపాతం వాతావరణ సగటులను ఇది మించిపోయింది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉన్నప్పుడు వెచ్చని, తేమతో కూడిన గాలి పైకి లేచి విశాలమైన ప్రాంతంలోకి చేరినప్పుడు ఇలాంటి పొడవైన మేఘాల వరుసలు ఏర్పడతాయి. తేమతో కూడిన గాలి పైకి లేచినప్పుడు, అది చల్లబడి, భారీ వర్షాన్ని కురిపించే మేఘాలుగా ఘనీభవిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+