భూమి అడుగున రంగురంగుల గుహలు.. ఇక్కడకు వెళ్తే ప్రపంచాన్ని మర్చిపోతారు.. తెలంగాణలో ఎక్కడంటే..?

తెలంగాణ ప్రాంతం ఎంతో చారిత్రక విశిష్టతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో అనేక చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, కోటలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అనేక పురాతన కట్టడాలు ఉన్నాయి. కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు ఈ భాగ్యనగరం ప్రాంతాన్ని పలు దశల్లో అభివృద్ధి చేశారు. అయితే మనకు తెలిసిన చారిత్రక ప్రదేశాలు కాకుండా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ అరుదైన పర్యాటక ప్రదేశం ఒకటి ఉంది.

అక్కడి గుహలు చాలా ఫేమస్.. సాధారణంగా గుహలు అనగానే బెలూం గుహలు, అజంతా, ఎల్లోరా, ఎలిఫెంట్ గుహలు అందరికీ గుర్తుకువస్తాయి. కానీ తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఈ పురాతన గుహల గురించి తెలుసా..? ఈ రంగురంగుల గుహలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. భూమి లోపల దాగి ఉన్న గుహలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న గాజుబేడం గుహ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి గుహలు ప్రకృతి పరంగా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. ఈ రంగు రంగుల గుహలు పర్యటకులను ఆశ్చర్య పరుస్తున్నాయి.

కాచరాజుపల్లి అటవీ ప్రాంతంలోని గాజుబేడం గుహను మునుల గుహ లేదా భావోజి గుహ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలోని అరుదైన లక్షణాలు ఈ గుహకు ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన వెంటనే ఇక్కడి గోడలు ఎరుపు, ఆరెంజ్ కలర్స్ తో కనువిందు చేస్తాయి. గుహ అంతర్భాగంలోని సొరంగాలు, చిన్న చిన్న గదులు, అంతస్తుల్లా కనిపించే రాతి నిర్మాణాలు ప్రకృతి ప్రసాదించిన సంపదగా ఆకట్టుకుంటాయి.

Chandampet caves in nalgonda district Telangana attracting tourists the colourful caves attracting

ప్రస్తుతం ఈ గుహలపై పరిశోధకులు పరిశోధనలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త సంగతులు బయటపడనున్నాయి. ఈ అరుదైన గుహలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీరూ ఈ రంగురంగుల గుహలను చూసేయండి.. ఈ గుహలు హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉన్నాయి. దాంతో వీకెండ్ లో నగరవాసులకు ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+