జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలోని రెండు హోటళ్లలో దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. రిట్జ్ కార్లటన్, మారియట్ హోటళ్లలో జరిగిన ఈ పేలుళ్లలో 9 మంది విదేశీయులు మృతి చెందగా.. 36 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. హోటళ్లల్లోని వీదీశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.