కొత్త చేయూత పెన్షన్ లపై కీలక అప్డేట్.. డెడ్ లైన్ అప్పుడే, సెర్ప్ కు ఆదేశం!
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పెన్షన్ దారులకు ఆగస్ట్ 15 నుండి పథకం అందిస్తామని తెలంగాణా సర్కార్ వెల్లడించింది. తెలంగాణా సర్కార్. తెలంగాణా రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఇలా నిరుపేదలైన వారికి చేయూత పెన్షన్ లను అందిస్తుంది తెలంగాణా సర్కార్.
చేయూత పెన్షన్ పథకంపై లబ్దిదారులకు అలెర్ట్
ఈ క్రమంలో పెన్షన్ లబ్దిదారుల విషయంలో కీలక అలెర్ట్ ను ఇచ్చింది. చేయూత పెన్షన్ పథకం లబ్దిదారులకు సంబంధించిన గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న లైవ్ అధెంటికేషన్ ముఖ గుర్తింపు సర్వేను ఈ నెలాఖరు నాటికి అత్యంత వేగంగా పూర్తి చెయ్యాలని రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి పూర్తి వివరాల సమర్పణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లైవ్ అధెంటికేషన్ ముఖ గుర్తింపు సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు, సమగ్ర నివేదికను రూపొందించి, ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మూడు నెలలుగా సర్వే
అయితే సర్వేలో భాగంగా పించన్ పొందుతున్న వారిలో అనర్హులను, మరణించిన వారిని, నిబంధనలకు విరుద్ధంగా లబ్ది పొందే వారిని గుర్తించి జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. గత మూడు నెలలుగా సర్వే కొనసాగిస్తున్నారు.
సర్వేలో ప్రాధమికంగా 1,21,229మందిని అనర్హులు
రాష్ట్రంలో ఇప్పటివరకు సెర్ప్ నిర్వహించిన ముఖ గుర్తింపు నమోదు సర్వేలో ప్రాధమికంగా 1, 21, 229మందిని అనర్హులుగా అధికారులు తేల్చారు. ఆగస్ట్ 5 వరకు నిర్వహించే సర్వేలో మరికొంత మంది కూడా అనర్హులుగా తేలే అవకాశం ఉంది . త్వరలో వీరిని పూర్తి స్థాయిలో జాబితా నుండి తొలగిస్తారు. ఇదిలా ఉంటేకొత్తగా పెన్షన్ లు పొందటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షలకు పైగా అర్హులైన వారు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలను పరిశీలించి అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్ ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications