గోదావరి పుష్కరాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం - భక్తుల కోసం కొత్తగా..!!

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సారి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. కుంభమేళా తరహా ఏర్పాట్ల పైన కసరత్తు జరుగుతోంది. రూ 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సారి పుష్కర ఘాట్లు.. వసతి కోసం టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీగా రైళ్లు.. బస్సులను ముందుస్తుగానే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికలు వేస్తోంది. ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 500 పైగా ఘాట్‌లు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుడుతూ రూ.150 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ నిధుల్లో ఎక్కువ శాతం రాజమహేంద్ర వరం మున్సిపల్ కార్పొరేషన్‌కు అత్యధికంగా రూ.100 కోట్లు కేటాయించారు. గోదావరి పుష్కరాల ప్రధాన కేంద్రంగా రాజమహేంద్రవరం ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ap-govt-allocate-rs-150-cr-for-godavari-pushkaram-works-in-rajahmundry-and-narsapuram

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

అదే విధంగా కొవ్వూరుకు రూ.20 కోట్లు, నరసాపురానికి రూ.15 కోట్లు, నిడదవోలుకు రూ.7 కోట్లు, పాలకొల్లుకు రూ.5 కోట్లు, మండపేటకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మొత్తం ఆరు పట్టణాల్లో పుష్కరాల ఏర్పాట్లకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి, పాత సదుపాయాల పునరుద్ధరణ, పుష్కరాల సమయంలో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఇక 2015లో 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా, 2027 పుష్కరాలకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా ఘాట్ల నిర్మాణ పనుల టెండర్లకు సిద్ధమవుతోంది. అలానే పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానికి తగ్గట్లు ఏర్పాట్లకు ఇప్పటి నుంచే అంచనాలు సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+