ముంబయి: అమెరికా విదేశాంగశాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ శనివారం తాజ్ హోటల్ లో వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపారస్తులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె ముంబాయి ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారికోసం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆమె పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి భారత్ కు వచ్చిన విషయం విదితమే. ఈరోజు ముంబాయివలోనే ఉంటారు.