విద్యార్థినిపై అత్యాచారం, హత్య?
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో ఎంబిఎ విద్యార్థిని భార్గవిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి మేనమామ మహేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మహేంద్ర కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
భార్గవి కావలిలో ఎంబిఎ చదువుతోంది. ఆమె శవం ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెది ఆత్మహత్య అని భావించిన పోలీసులు శవాన్ని స్వస్థలం పాకాలకు తరలించారు. తాజాగా మహేంద్రపై ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేయడంతో శవానికి పోస్టు మార్టం నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.












Click it and Unblock the Notifications