చెన్నై: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఆయన ఇచ్చిన 'కలలు కనండి - వాటిని సాకారం చేసుకోండి' నినాదం ఆధారంగా హిందీలో ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం పేరు 'మై కలాం హూ'. నిజ జీవితంలో శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' లాగే ఈ చిత్రంలోనూ కొందరు మురికివాడల పిల్లలను నటింపజేస్తున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ పాండే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఇంకా గుల్షన్ గ్రోవర్, ఫ్రెంచ్ నటి సోఫీ తదితరులు నటిస్తున్నారు.