హైదరాబాద్: జెరూసలేం యాత్రకు వెళ్లేవారికి ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చిన సర్కారుకు కోర్టులో చుక్కెదురైంది. ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ పూర్తయ్యేంతవరకు ఉత్తర్వులు అమలుచేయరాదంటూ స్టే ఇచ్చింది.