రాజమండ్రి: కేరళ నర్సింగ్ విద్యార్థినిల అత్యాచారం కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే రామారావును టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రామారావును వెంటనే విడుదల చేసి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను బలహానపరిచేందుకు వైఎస్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆశోక్ గజపతిరాజు ఆరోపించారు.