హైదరాబాద్: టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో దాఖలైన కేసులపై హైకోర్టు మంగళవారం 'స్టే' విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఇటీవలి ఎన్నికల్లో ఆయా జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసులపై కింది కోర్టులు చేపట్టిన అన్నిరకాల చర్యలను రద్దుచేయాలని కోరుతూ బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు కేసులపై స్టే విధించింది.