ముంబయి: నేరాంగికారంలో తనపై ఎవరి ఒత్తిడిలేదని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ముంబయి పేలుళ్ళ కేసులో ప్రధాన ముద్దాయి కసబ్ అన్నాడు. అంతేకాకుండా తనను శారీరకంగా కాని, మానసికంగా కాని ఎవరూ హింసించలేదని కసబ్ కోర్టులో తెలిపాడు. అవసరమైతే తనను ఉరి తీయవచ్చని చెప్పాడు.