న్యూఢిల్లీ: ఏఐసీపీ కార్యదర్శి, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆంధ్రాభవన్ ను సందర్శించారు. అక్కడ చక్కటి భోజన్నాన్ని ఆరగించారు. అకస్మాత్తుగా రాహుల్‌గాంధీ ఆంధ్రాభవన్ కు చేరుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనను చూడటానికి ఎగబడ్డారు. భోజనం చేసిన తరువాత సామాన్య పౌరుడిగా తన కారెక్కి వెళ్లిపోయారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాగే ప్యారడైజ్ హోటల్ కు వెళ్ళి బిర్యానీ ఆరగించారు. ఆయనను కాంగ్రెస్ నాయకులు గుర్తించేలోపే అక్కడి నుంచి నిష్క్రమించారు.