న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కెసీఆర్ ఆచూకీ కోసం న్యూఢిల్లీలోని ఆయన ఇంటి ముందు మహబూబ్‌నగర్ జిల్లా బంజారాలు ధర్నా చేశారు. నియోజకవర్గాన్ని మరిచిపోయారని వారు ఆందోళన చేస్తున్నారు. కెసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిచిన తర్వాత ఇంతవరకు నియోజకవర్గం ముఖం చూడలేదని ఆరోపిస్తున్నారు. డీడీఆర్ సీ మీటింగ్‌లకూ గైర్హాజరయ్యారని వారు మండిపడ్డారు. కెసీఆర్ ఆచూకీ తెలపండంటూ లోక్ సభ స్పీకర్ మీరాకుమారికి వారు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు.