నెల్లూరులో మహిళపై యాసిడ్ దాడి
నెల్లూరు: నెల్లూరులో తాజాగా శశికళ అనే వివాహితపై ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.ఈ దాడిలో శశికళ గాయపడింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దాడి చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. దాడి చేసిన అజీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై యాసిడ్ దాడులు విరివిగా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఇటీవల వరుస యాసిడ్ దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. యాసిడ్ దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ఎంతగా చెప్పినా అవి ఆగడం లేదు.












Click it and Unblock the Notifications