ముంబై పేలుళ్లు: ముగ్దురు దోషులు
ముంబై: ఆరేళ్ల క్రితం జరిగిన ముంబై జంట పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను పొటా కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2003లో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జావేరీ బజారుల్లో పేలుళ్లు సంభవించి 52 మంది మరణించగా. 184 మంది గాయపడ్డారు. వారికి ఆగస్టు 4వ తేదీన వారికి కోర్టు శిక్షలను ఖరారు చేస్తుంది. ఆటో డ్రైవర్ హనీఫ్ సావ్వేద్ (46), అతని భార్య ఫహ్మీదా (43), అష్రాత్ అన్సారీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
ఈ కేసులో నాలుగో నిందితుడు అప్రూవర్ గా మారాడు. గత ఆరేళ్లుగా ఫహ్మీదా జెకుల్లా మహిళా కరాగారంలో ఉంటుండగా మిగతా ఇద్దరు ఆర్థర్ రోడ్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో కోర్టు 103 మంది సాక్షులను విచారించింది.












Click it and Unblock the Notifications