ఒంగోలు: ఈసారి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలనుంచి ఓట్లకు బదులు చెప్పులు పడతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. చినగంజాం స్నోవైట్ భూముల కేసులో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లాలోని చీరాల కోర్టుకు హాజరయ్యారు. చినగంజాం ఉప్పు భూములను పేదలకు పంచేవరకూ తమ పోరాటం ఆగదని ఆయన అంతకు ముందు మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయకుండా సభలో పాలక, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవటం సిగ్గుచేటన్నారు. శాసనసభలో ప్రధాన పార్టీల వ్యవహార శైలిని ఆయన తప్పు పట్టారు.