మగధీర ప్రదర్శనకు బ్రేక్ : బొత్సా

థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా అనే విషయాలు పరిశీలించిన తర్వాత మగధీర సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కమిటీ పరిశీలన జరుపుతోందని, ఆ పరిశీలనను బట్టి చర్యలుంటాయని ఆనయ అన్నారు. ప్రేక్షకాదరణ ఉన్న సినిమాల ప్రదర్శన సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు నిర్మాతలు, పంపిణీదారులు, సినిమాకు సంబంధించిన ఇతరులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, థియేటర్లలో భద్రతా ఏర్పాట్లపై మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.












Click it and Unblock the Notifications